U-19 Cricket World Cup : Lets Meet Hyderabad Batsman Thakur Thilak Varma || Oneindia Telugu

2019-12-03 1

Hyderabad batsman Thakur Thilak Varma has been selected to represent India in the World Cup under-19 cricket tournament
#U19CricketWorldCup
#ThakurThilakVarma
#WorldCup
#ICCU19WorldCup2020
#HyderabadBatsman


ఠాకూర్‌ తిలక్‌ వర్మ... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. అందుకు కారణం భారత్ నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవ్వడమే. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి జరగే అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు బీసీసీఐ సోమవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ఠాకూర్‌ తిలక్‌ వర్మకు చోటు దక్కింది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన తిలక్ వర్మ... ఆఫ్‌ స్పిన్ బౌలింగ్‌ కూడా వేస్తాడు. టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్‌‌ రైనాను అమితంగా ఇష్టపడతాడు. చిన్నప్పటి నుంచి తిలక్‌‌‌‌ వర్మకు క్రికెట్‌‌‌‌ తప్ప వేరే వ్యాపకం లేదు.